బీటెక్, డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఐబీఎం, టాస్క్ మధ్య కీలక ఒప్పందం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు..

బీటెక్, డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఐబీఎం, టాస్క్ మధ్య కీలక ఒప్పందం..
Follow us

|

Updated on: Dec 15, 2020 | 8:35 AM

Good News To BTech Students: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆన్‌లైన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం టెక్నాలిజీ దిగ్గజం ఐబీఎం(IBM)తో చేతులు కలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కు ఉచితంగా టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు IBM, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) మధ్య ఒప్పందం కుదిరింది. సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి కోర్సులను ఫ్రీగా బోధించనున్నారు. 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ అవకాశం లభించనుండగా.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://open.ptech.org ద్వారా రిజిస్టర్ కావాలని టాస్క్ సూచించింది.

Also Read:

తొలి దశలో కోటి మందికి టీకా.. హెల్త్‌కేర్‌ వర్కర్లకే మొదటి ప్రాధాన్యత.. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏపీ ప్రభుత్వం సిద్ధం.!

బిగ్ బాస్ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు.? రైతుల కోసం డ‌బ్బు ప‌క్క‌న పెడతానన్న అరియానా.. శభాష్ అంటున్న నెటిజన్లు.!

మగువలకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఫిబ్రవరి 2021 నాటికి రూ. 42,000 చేరుకునే అవకాశం..!