బిగ్‌బాస్ షో ప్రారంభం… డేట్స్ ఫిక్స్!

బిగ్‌బాస్ రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ ఉందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో విజయవంతంగా 12 సీజన్లు పూర్తి చేసుకొన్నది. త్వరలోనే 13వ సీజన్‌కు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బిగ్‌బాస్ 13 జాబితా ఇదే అంటూ రూమర్లు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ నటులు కరణ్ పటేల్, హీరోయిన్ జరీన్ ఖాన్ ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో హడావిడి చేయనున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో బిగ్ […]

బిగ్‌బాస్ షో ప్రారంభం... డేట్స్ ఫిక్స్!
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 07, 2019 | 9:41 PM

బిగ్‌బాస్ రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ ఉందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో విజయవంతంగా 12 సీజన్లు పూర్తి చేసుకొన్నది. త్వరలోనే 13వ సీజన్‌కు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బిగ్‌బాస్ 13 జాబితా ఇదే అంటూ రూమర్లు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ నటులు కరణ్ పటేల్, హీరోయిన్ జరీన్ ఖాన్ ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో హడావిడి చేయనున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 13 ప్రసారమయ్యే తేదీలను నిర్వాహకులు వెల్లడించారు. మేము అధికారికంగా టీమ్‌తో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించాం. సెప్టెంబర్ చివరి వారంలో గానీ, అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం అవుతుంది. ఈ తాజా సీజన్ ఖచ్చితంగా సెప్టెంబర్ 29న ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.

బిగ్‌బాస్ 13 సీజన్ 15 వారాలపాటు సాగుతుంది. జనవరి 12, 2020 వరకు ఇది కొనసాగుతుంది అని నిర్వాహకులు తెలిపారు.  బిగ్‌బాస్ 13 జాబితా ఇదే…

1. జరీన్ ఖాన్ (బాలీవుడ్ నటి)

2. చంకీ పాండే (బాలీవుడ్ నటుడు)

3. రాజ్పాల్ యాదవ్ (బాలీవుడ్ నటుడు)

4. వార్ని హుస్సేన్ (భారతీయ మోడల్)

5. దేవలేన భట్టాచార్జీ (మహిళా టెలివిజన్ స్టార్)

6. అంకిత లోఖాందే (భారతీయ నటి)

7. రాకేష్ వశిష్ష్ (టెలివిజన్ నటుడు)

8. మహాకా శర్మ (వివాదాస్పద నటి)

9. డానీ D (మగ శృంగార తార)

10. జీత్ (బెంగాలి సూపర్ స్టార్, బిగ్ బాస్ బాంగ్ హోస్ట్)

11. చిరాగ్ పాశ్వాన్ (రాజకీయవేత్త, మాజీ నటుడు)

12. విజేందర్ సింగ్ (బాక్సర్, నటుడు)

13. రాహుల్ ఖండెల్వాల్ (మోడల్)

14. హిమాంశ కోహ్లి (మోడల్ మరియు నటుడు)

15. మహామా చౌదరి (మాజీ బాలీవుడ్ నటి)

16. మేఘన మాలిక్ (TV నటి)

17. మహాకాక్షి చక్రవర్తి (మిథున్ చక్రవర్తి కుమారుడు, నటుడు)

18. దయానంద్ షెట్టి (CID ప్రఖ్యాత నటుడు)

19. ఫైజీ బు (అలంకరణ కళాకారుడు / LGBTQ)

20. రితు బేరి (ఫ్యాషన్ డిజైనర్)

21.సోనల్ చౌహాన్ (సింగర్, మోడల్)

22. ఫజిల్పూరియా రాహుల్ యాదవ్ (సింగర్)

23. సిద్ధార్థ శుక్ల (నటుడు)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu