బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: వంశీ వైసీపీ మధ్య సహజీవనం!

చట్టసభల్లో ఫిరాయింపుల అంశం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు దేశంలో కొత్త చర్చకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ ను కోరారు. టీడీపీ తనను సస్పెండ్‌ చేసినందున, ఆ పార్టీతో కలసి తాను కూర్చోలేకపోతున్నానని వంశీ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి గెలిచిన సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించవచ్చా అన్నది చర్చనీయాంశమైంది. […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: వంశీ వైసీపీ మధ్య సహజీవనం!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 10, 2019 | 11:22 PM

చట్టసభల్లో ఫిరాయింపుల అంశం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు దేశంలో కొత్త చర్చకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ ను కోరారు. టీడీపీ తనను సస్పెండ్‌ చేసినందున, ఆ పార్టీతో కలసి తాను కూర్చోలేకపోతున్నానని వంశీ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి గెలిచిన సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించవచ్చా అన్నది చర్చనీయాంశమైంది. తమ పార్టీ అనుమతి లేకుండా స్పీకర్‌ తమ సభ్యుడిని ప్రత్యేకంగా గుర్తించడానికి వీల్లేదని టీడీపీ వాదిస్తోంది. వంశీ మాట్లాడటం, టీడీపీ అభ్యంతరాలు తెలిపి, వాకౌట్‌ చేయడంతో అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వంశీ విషయంలో టీడీపీ తమ వాదనను బలంగా వినిపిస్తోంది. వంశీని తాము సస్పెండ్‌ మాత్రమే చేశామనీ, తొలగించలేదని చెబుతోంది. తాము సస్పెండ్‌ చేసిన సభ్యుడిని ఏ రూల్‌ ప్రకారం ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తారంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. స్పీకర్‌ చెప్పినట్లు ఒకవేళ వంశీ ప్రత్యేక సభ్యుడైతే, టీడీపీ జారీచేసే విప్‌ వర్తిస్తుందా? లేక అనర్హత వేటు పడుతుందా అన్నది కీలకంగా మారింది.