శ్రీశైలం డ్యామ్: నూటికి నూరుశాతం సేఫ్…

| Edited By: Srinu

Nov 22, 2019 | 12:18 PM

కృష్ణా జలాలతో తెలుగుప్రజల దాహార్తి తీరుస్తూ, తెలుగు రాష్ట్రాల నేలను తడుపుతున్న శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందని వాటర్‌మ్యాన్‌ రాజేంద్రసింగ్‌ హెచ్చరించడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. కృష్ణానది ఉగ్ర రూపాన్ని పలుమార్లు తట్టుకుని నిలబడిన శ్రీశైలం డ్యామ్‌ నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. శ్రీశైలంలో సమస్యలు పట్టించుకోకపోతే సగం ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బందులు తప్పవని రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. అయితే వాటర్‌మ్యాన్‌ చెప్పినంత స్థాయిలో సమస్యలు ఏమి లేవని అటు […]

శ్రీశైలం డ్యామ్: నూటికి నూరుశాతం సేఫ్...
Follow us on

కృష్ణా జలాలతో తెలుగుప్రజల దాహార్తి తీరుస్తూ, తెలుగు రాష్ట్రాల నేలను తడుపుతున్న శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందని వాటర్‌మ్యాన్‌ రాజేంద్రసింగ్‌ హెచ్చరించడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. కృష్ణానది ఉగ్ర రూపాన్ని పలుమార్లు తట్టుకుని నిలబడిన శ్రీశైలం డ్యామ్‌ నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. శ్రీశైలంలో సమస్యలు పట్టించుకోకపోతే సగం ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బందులు తప్పవని రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. అయితే వాటర్‌మ్యాన్‌ చెప్పినంత స్థాయిలో సమస్యలు ఏమి లేవని అటు ఏపీ నర్కార్‌, ఇటు ఇంజినీర్లు కొట్టిపారేస్తున్నారు. దేశంలో రెండో అతిపెద్ద జల విద్యుత్‌ ప్రాజెక్టుపై నిజంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయా? నిజంగా శ్రీశైలం డ్యామ్‌ సురక్షితంగా ఉందా.? అసలు ఎందుకని డ్యామ్ భద్రతపై ఇన్ని డౌట్లు రైజ్ అవుతున్నాయి.? అనే అంశాలపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ జరిగింది.

శ్రీశైలం డ్యామ్ ముందు గొయ్యి కథా కమామిషు…

శ్రీశైలం డ్యామ్‌కు దిగువ భాగంలో ఉన్న ప్లంజ్‌ పూల్‌‌లో భారీగా గొయ్యి ఏర్పడింది. డ్యామ్ గేట్లు ఎత్తిన ప్రతీసారి అది మరింత పెద్దదవుతుందని రాజేంద్రసింగ్ అంటున్నారు. ఆ గొయ్యి విస్తరిస్తూ.. డ్యామ్ పునాదుల వరకు వెళ్తుందని.. దాంతో.. చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉందని వాటర్ మ్యాన్ పేర్కొన్నారు. ఇక ఆ గొయ్యి వల్ల శ్రీశైలం డ్యామ్‌‌కు ఎంతవరకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉందన్న విషయంపై రిటైర్డ్ సీఈ సాంబయ్య ఏమన్నారో ఆయన మాటల్లోనే..

నూటికి నూరుశాతం సేఫ్…

ఈ సంభాషణ మధ్యలో ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన శ్రీశైలం ప్రాజెక్ట్ ఎస్ఇ చంద్రశేఖర్ రావు డ్యామ్ భద్రతపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లంజ్‌ పూల్‌‌ అనేది స్పిల్ వే డిజైన్‌లోని భాగంగా ఏర్పాటు చేసిందన్నారు. అంతేకాకుండా ప్లంజ్‌ పూల్‌‌‌కు కావాల్సిన మరమ్మతులు చేస్తామని ఆయన అన్నారు. దీంతో పాటు ఆయన శ్రీశైలం డ్యామ్ గురించి కూలంకషంగా చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఏంటన్నవి ఆయన మాటల్లోనే..