AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెలికం కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక..!

ఇప్పటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మోరటోరియం విధిస్తూ.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో టెలికం కంపెనీలకు పెద్ద ఎత్తున ఊరట కల్గినట్లైంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్‌లు రూ.42,000 కోట్లకు పైగా స్పెక్ట్రం రుసుము చెల్లించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ టెలికం ఆపరేటర్లలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో […]

టెలికం కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 22, 2019 | 12:24 PM

Share

ఇప్పటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మోరటోరియం విధిస్తూ.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో టెలికం కంపెనీలకు పెద్ద ఎత్తున ఊరట కల్గినట్లైంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్‌లు రూ.42,000 కోట్లకు పైగా స్పెక్ట్రం రుసుము చెల్లించాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం ఈ టెలికం ఆపరేటర్లలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ముఖ్యంగా వోడాఫోన్ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. పెద్ద ఎత్తున అప్పులు ఉండటంతో.. ఇక కంపెనీ చేతులెత్తేసి దేశం విడిచి వెళ్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనికి ముఖ్య కారణం ఇటీవల ఆపరేటర్ల మధ్య నెలకొన్న పోటీ. దీంతో ఈ సంక్షోభంలో వోడాఫోన్, ఎయిర్ టెల్, ఐడియా నష్టాల్లోకి వెళ్లాయి. అదే సమయంలో జియో మాత్రం మంచి లాభాలను గడించింది. అయితే తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో వోడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి.

కేంద్ర క్యాబినెట్ సమావేశం అనంతరం దీనికి సంబంధించి ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఇటీవల టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గమనించి.. సీఓఎస్ సిఫారసులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండేళ్ల పాటు స్పెక్ట్రం వేలం వాయిదాల చెల్లింపులను వాయిదా వేసినట్టు తెలిపారు. దీంతో రాబోయే 2020 – 21, 2021- 22 సంవత్సరాలకు కంపెనీలు స్పెక్ట్రం చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం లేదు. తిరిగి 2022-23 సంవత్సరానికి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో.. టెలికం కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు