ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. జనవరి 14వ తేదీన సుశాంత్ తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే సుశాంత్ సింగ్ మరణ వార్త తెలియడంతో సినీ లోకం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈ డెత్ న్యూస్ బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే.. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ నివాళులు అర్పించింది. సుశాంత్ జ్ఞాపకార్థం 550 మంది పేద కుటుంబాలకు.. ఏక్ సాత్ ఫౌండేషన్ ద్వారా అన్నదానం చేస్తానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసి వెల్లడించింది భూమి పెడ్నేకర్. కాగా 2019లో అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోంచిరియా’ అనే సినిమాలో సుశాంత్, భూమి పెడ్నేకర్‌లు జంటగా నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
Read More:
వకీల్ సాబ్ నుంచి న్యూ స్టిల్ లీక్.. నల్లకోటులో పవన్..
బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..