కరోనా పేషెంట్లకు ఆయుర్వేద చికిత్స..!

| Edited By:

Apr 23, 2020 | 3:02 PM

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి.  శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరోనా వ్యాధిగ్రస్థులపై

కరోనా పేషెంట్లకు ఆయుర్వేద చికిత్స..!
Follow us on

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి.  శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరోనా వ్యాధిగ్రస్థులపై తొలిసారి ఆయుర్వేద చికిత్స (క్లినికల్‌ ట్రయల్స్‌)ను ప్రారంభించేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు.

కాగా.. కరోనా రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ‘ఫిఫట్రాల్‌’ అనే ఆయుర్వేద ఔషధాన్ని ప్రయోగించేందుకు బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యు) ప్రధాన పరిశోధకుడు డాక్టర్‌ కె.ఎన్‌.ద్వివేది నేతృత్వంలో కార్యాచరణ రూపొందించారు. దీన్ని కొవిడ్‌-19పై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యదళం (టాస్క్‌ఫోర్స్‌) పరిశీలనకు నివేదించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఇంకా అనుమతులు ఇవ్వలేదని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పేర్కొన్నారు.

Also Read: రాగల రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు..