Egg Popcorn: వింత రెసిపీలు గుడ్డుతో పాప్‌కార్న్.. పుస్తకం డీప్ ప్రై.. ఇవేం వంటలు అంటున్న కొంతమంది నెటిజన్లు

|

Oct 22, 2021 | 11:45 AM

Egg Popcorn: పాప్‌కార్న్ .. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఇష్టపడే స్నాక్స్.. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ కు వెళ్ళే సినీ ప్రేమికులకు ఇష్టమైన స్నాక్స్ పాప్‌కార్న్..

Egg Popcorn: వింత రెసిపీలు గుడ్డుతో పాప్‌కార్న్.. పుస్తకం డీప్ ప్రై.. ఇవేం వంటలు అంటున్న కొంతమంది నెటిజన్లు
Viral Video
Follow us on

Egg Popcorn: పాప్‌కార్న్ .. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఇష్టపడే స్నాక్స్.. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ కు వెళ్ళే సినీ ప్రేమికులకు ఇష్టమైన స్నాక్స్ పాప్‌కార్న్. పాప్‌కార్న్‌పై ఉన్న ప్రేమ తో వివిధ రకాల టేస్టులతో పాప్‌కార్న్ లను ఆవిష్కరించారు. పాకం పాప్‌కార్న్, చీజ్ పాప్‌కార్న్, చాక్లెట్ పాప్‌కార్న్ , టమోటా పాప్‌కార్న్ ఇలా అనేక రకాల పాప్‌కార్న్ లను తయారు చేశారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎగ్ ప్లేవర్డ్ పాప్‌కార్న్ తయారీ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోలో రెసిపీపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు పాప్‌కార్న్ లో కూడా నాన్ వెజ్ పాప్‌కార్న్ లు తయారు అవుతున్నాయని.. ఇక నుంచి కొనుకునే ముందు చూసి తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పాప్‌కార్న్

 

ఒక పాన్ లో మొక్కజొన్న గింజలను వేసి.. గుడ్డును కూడా వేశారు. కొన్ని నిమిషాల తర్వాత పాప్‌కార్న్ రెడీ అయ్యింది. ఈ వీడియో  scottsrealityలో షేర్ చేశారు. ఇప్పటి వరకూ గుడ్డిని టిఫిన్స్ లో కూరలు, కేకులు, వివిధ రకాలు ఐటమ్స్ తయారు చేస్తారు. కానీ గుడ్డుతో పాప్‌కార్న్ తయారీ ఇప్పుడే చూస్తున్నామని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అసలు ఈ కాంబో గురించి ఆలోచనే గందరగోళానికి గురి చేస్తుందని.. అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ బ్లాగర్ scottsreality వింతైన విషయాలను వంట చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఒక వీడియోలో ఏకంగా పుస్తకాన్ని డీప్ ఫ్రై చేయడానికి ప్రయత్నించాడు.. అవును, మీరు సరిగ్గా విన్నారు. అతను ఒక పుస్తకాన్ని పిండిలో పూసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేసాడు.

 

Also Read: Nokia XR20: కింద పడినా పగలని.. నీటిలో తడిచినా పాడవని స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసిన నోకియా.. ధర ఎంత అంటే