AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలకు తుపాకి గురిపెట్టి బీజేపీ నేత కూతురిని..

పశ్చిమ బెంగాల్ లో కిడ్నాప్ ల ఘటనలు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీని వీడి కమలం గూటికి చేరుతున్న నేతలపై వరుస దాడులు జరుగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నెలలో ఓ బీజేపీ నేత భార్యపై లైంగిక దాడి ఘటన మరువక ముందే నిన్న మరో బీజేపీ నేత కూతరుని అగంతకులు అపహరించుకుపోయారు. బీర్బమ్ జిల్లాలోని లబ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన బీజేపీ నేత సుప్రభాత్ బత్యాబ్యాల్ నివాసంలో […]

తలకు తుపాకి గురిపెట్టి బీజేపీ నేత కూతురిని..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:03 PM

Share

పశ్చిమ బెంగాల్ లో కిడ్నాప్ ల ఘటనలు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీని వీడి కమలం గూటికి చేరుతున్న నేతలపై వరుస దాడులు జరుగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నెలలో ఓ బీజేపీ నేత భార్యపై లైంగిక దాడి ఘటన మరువక ముందే నిన్న మరో బీజేపీ నేత కూతరుని అగంతకులు అపహరించుకుపోయారు. బీర్బమ్ జిల్లాలోని లబ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన బీజేపీ నేత సుప్రభాత్ బత్యాబ్యాల్ నివాసంలో అతని కుమార్తె (22)కు తుపాకీ గురిపెట్టి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఇంటివద్ద సుప్రభాత్ లేరు. ఐదు నెలల క్రితమూ ఈయన టీఎంసీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. టీఎంసీలో చేరకముందు ఆయన సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కాగా కిడ్నాప్ కు ముందు ఐదుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి..తమనందరినీ ఓ రూంలో బంధించి తాళం వేశారని సుప్రభాత్ సోదరుడు తెలిపారు. ఆ తర్వాత తుపాకిని ఎక్కుపెట్టి ఇంటిబయట ఉంచిన కారు వద్దకు లాక్కెళ్లి, ఆమెను తీసుకెళ్లిపోయారని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.

Follow Us