Curry Leaves: కూరలో కరివేపాకు అని తీసిపారేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే

|

Mar 20, 2022 | 4:21 PM

భారతీయ వంటల్లో కరివేపాకుది అగ్రస్థానం. ఏదైనా వంట చేసేటప్పుడు అందులో కరివేపాకు (Curry Leaves) వేయకపోతే ఏదో తెలియని వెలితి. కరివేపాకు కూరకు రుచితో పాటు చక్కని సువాసననూ అందిస్తుంది. అంతే కాకుండా కరివేపాకుతో...

Curry Leaves: కూరలో కరివేపాకు అని తీసిపారేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే
Curry Leaves
Follow us on

భారతీయ వంటల్లో కరివేపాకుది అగ్రస్థానం. ఏదైనా వంట చేసేటప్పుడు అందులో కరివేపాకు (Curry Leaves) వేయకపోతే ఏదో తెలియని వెలితి. కరివేపాకు కూరకు రుచితో పాటు చక్కని సువాసననూ అందిస్తుంది. అంతే కాకుండా కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుటేషియా కుటుంబానికి చెందిన కరివేపాకు శాస్త్రీయ నామం మురయా కొయినీ. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే కరివేపాకును వంటల్లోనే కాకుండా ఔషదాల్లోనూ ఉపయోగిస్తారు. జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు చక్కని మందులా (Medicine) ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్తి, జీర్ణాశయంలో ఆమ్లాల విడుదలను సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. కాలిన గాయాలు, దురదలు, చర్మ సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువు తగ్గిస్తుంది. లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషదం. కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది. కరివేపాకులోని యాంటిఅక్సిడేంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నంలో కాస్త కరివేపాకు పొడి, నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది. యూరిన్ సమస్యలనూ నివారిస్తుంది. కరివేపాకు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువ.

కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం.

కరివేపాకును పెనం మీద వేసి సన్నని మంటపై వేయించాలి. రంగు కాస్తా ముదుర రంగులో మారేంత వరకు ఉంచి స్టవ్ కట్టేయాలి. ఎండు మిరపకాయలనూ ఇదే విధంగా కాల్చుకోవాలి. చింతపండు నానబెట్టి గుజ్జు తీసి అందులో వేయించిన కరివేపాకును వేయాలి. వీటిని రోట్లో వేసి మెత్తగా దంచాలి. తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. చింతపండు, ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి నూరుకోవాలి. ఇది మరీ జారుగా ఉండకూడదు. ఇలా మెత్తని పొడిగా తయారయ్యాక జీలకర్ర, ఆవాలు, వివిధ రకాల పప్పులతో తాలింపు వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కరివేపాక పొడి రెడీ అయిపోతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read

Bachchhan Paandey : అక్షయ్ కుమార్ సినిమా పై మండిపడుతున్న నెటిజన్లు.. కారణం ఇదే..

IPL 2022: ధోనీ టీంలో పెరిగిన టెన్షన్.. వీసా దొరకక దూరమైన చెన్నై ఆల్ రౌండర్?

Air Conditioners: కొత్తగా ఏసీ కోనుగోలు చేయనున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..