జూలై 2, 3 తేదీల్లో బీటీపీఎస్ సింక్రనైజేషన్‌ ప్రక్రియ

చేపట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక రాష్ట్ర అవసరాలకు బీటీపీఎస్‌ తొలి యూనిట్‌ నుంచి విద్యుత్‌ను అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

జూలై 2, 3 తేదీల్లో బీటీపీఎస్ సింక్రనైజేషన్‌ ప్రక్రియ
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 29, 2020 | 4:55 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరాధారణకు గురైన నీళ్లు, ప్రాజెక్టులు, విద్యుత్ పై కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా చేపట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక రాష్ట్ర అవసరాలకు బీటీపీఎస్‌ తొలి యూనిట్‌ నుంచి విద్యుత్‌ను అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మణుగూరు, పినపాక సరిహద్దులో నిర్మిస్తున్న 1080 మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో యూనిట్‌-2 సింక్రనైజేషన్‌కు సిద్ధమైంది. ట్రయల్‌ రన్‌ ప్రక్రియలో భాగంగా ఇంజినీర్లు ఆదివారం లైటప్‌ ప్రారంభించారు. ఇప్పటికే యూనిట్‌-1లో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. యూనిట్‌-2లో కూడా విద్యుత్‌ ఉత్పత్తి మొదలు పెట్టేందుకు జెన్‌కో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బీహెచ్ఈఎల్, జెన్‌కో అధికారులు సంయుక్తంగా ఈ నిర్మాణ పనులు చేపడుతున్నారు. సుమారు 1, 179 ఎకరాల్లో రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో బీటీపీఎస్‌ను నిర్మిస్తున్నారు. 20 ఏజెన్సీల ఆధ్వర్యంలో సుమారు 3,000 మంది కార్మికులు బీటీపీఎస్ కోసం శ్రమిస్తున్నారు. జెన్‌కో, భెల్‌ తరఫున సుమారు 300 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు. జూలై 2, 3 తేదీల్లో యూనిట్‌-2లో సింక్రనైజేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే విద్యుత్‌ ఉత్పత్తి జరిగిలా ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. ఆ వెంటనే రెండో యూనిట్‌లో 270 మెగావాట్లు స్టేబుల్‌ కాగానే అధికారికంగా కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌ చేస్తామన్నారు.