Baby snake: పాము గుడ్ల నుంచి పిల్లలు బయటపడటం ఎంత అద్భుతం.!

|

Oct 10, 2021 | 10:12 PM

పాము గుడ్ల నుంచి పిల్లలు బయటపడటం ఎంతటి అద్భుతం.! ఒక జూలో కెమెరాకు చిక్కిన ఈ సృష్టి కార్యం నెట్టింట్లో వైరల్ అవుతోంది.  ఈ అరుదైన వీడియో

Baby snake: పాము గుడ్ల నుంచి పిల్లలు బయటపడటం ఎంత అద్భుతం.!
Snake Birth
Follow us on

Snake Birth: పాము గుడ్ల నుంచి పిల్లలు బయటపడటం ఎంతటి అద్భుతం.! ఒక జూలో కెమెరాకు చిక్కిన ఈ సృష్టి కార్యం నెట్టింట్లో వైరల్ అవుతోంది.  ఈ అరుదైన వీడియో గురించి నెటిజన్లు తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు ఈ కింది వీడియోలో చూడొచ్చు.. కాగా, ఇటీవల మహారాష్ట్రలో ఓ త్రాచుపాము పది గుడ్లను మింగి.. మళ్లీ ఆ గుడ్లను బయటకు కక్కింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని కోశాంబి గ్రామంలో నివసిస్తున్న పవన్ లోన్బుల్ నివాసంలోకి త్రాచుపాము రాత్రి వేళ ప్రవేశించింది. అనంతరం అక్కడ ఉన్న కోడి గుడ్లను మింగింది. ఆపై సతమతమవుతూ.. బుసలు కొడుతూ.. కోడి దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలో శబ్ధం విని బయటకు వచ్చిన కుటుంబం.. ఆ పామును చూసి భయంతో పరుగులు తీసింది. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారమివ్వగా అతను వచ్చి పామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో మింగిన గుడ్లను కక్కడం ప్రారంభించింది. వామ్మో ఈ పాము అన్ని గుడ్లు ఎలా తిని.. కక్కిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.