Kidnapped Baby Girl Rescued: సీసీ ఫుటేజ్ ఆధారంగా మలక్ పేట్ చిన్నారి కిడ్నాప్ కేసులు 24గంటల్లోనే చేధించిన పోలీసులు..

హైదరాబాద్ మలక్ పేట్ లో చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 27న అర్ధరాత్రి ముసారాంబాగ్ చౌరస్తాలో అమ్ములు అనే చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. చెత్త ఏరుకొని జీవనం సాగిస్తున్న...

Kidnapped Baby Girl Rescued: సీసీ ఫుటేజ్ ఆధారంగా మలక్ పేట్ చిన్నారి కిడ్నాప్ కేసులు 24గంటల్లోనే చేధించిన పోలీసులు..

Updated on: Jan 29, 2021 | 3:31 PM

Kidnapped Baby Girl Rescued: హైదరాబాద్ మలక్ పేట్ లో చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 27న అర్ధరాత్రి ముసారాంబాగ్ చౌరస్తాలో అమ్ములు అనే చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. చెత్త ఏరుకొని జీవనం సాగిస్తున్న అజయ్ , లక్ష్మీ కూతురును కిడ్నపర్స్ తీసుకుని వెళ్లారు. రాత్రి 1 గంట సమయంలో తమ మధ్య పడుకున్న అమ్ములను బైక్ పై వచ్చిన వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తల్లిదండ్రులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. కిడ్నాపర్ నుండి పాపను రక్షించి తల్లిందండ్రులకు అప్పగించారు.

 

Also Read: :అమెరికాలో భారతీయ సంతతి డాక్టర్ ఘాతుకం.. ఓ వైద్యురాలిని చంపి..తనని తాను కాల్చున్న భరత్