వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాత్రూంలోనే నిండు గర్బిణి ప్రసవం..

|

Dec 24, 2020 | 6:39 PM

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ పసి ప్రాణం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం జరిగింది.

వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాత్రూంలోనే నిండు గర్బిణి ప్రసవం..
Follow us on

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ పసి ప్రాణం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం జరిగింది. ఓ మహిళ ప్రసవం కోసం తాండూరు ఆసుపత్రి రాగా అక్కడ వైద్య సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోనే ప్రసవించింది. పుట్టగానే ఆ శిశువు మరణించింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మల్ రెడ్డి పల్లికి చెందిన నిండు గర్భిణీ మనీషా పురిటి నొప్పులతో ఉదయం 3 గంటల సమయంలో తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆ సమయానికి ఆమెకు చికిత్స చేయడానికి అక్కడ సిబ్బంది ఎవరు లేరు. దీంతో ఆ మహిళ ఆసుపత్రి ఆవరణలోగల బాత్రూంలో ప్రసవించింది. అయితే మనీషాకు పుట్టిన శిశువు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మనీషా కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీషా ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఆసుపత్రిలో సిబ్బంది ఎవరు లేకపోవడం, సమాచారం ఇచ్చిన ఎవరు రాకపోవడంతో తమ బాబు చనిపోయాడంటూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కాగా మనీషాకు మొదట పాప జన్మించగా ఇప్పుడు బాబు పుట్టి చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించడంతోనే తమ బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు హస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.