బంతికి శానిటైజర్ పూసిన ఆస్ట్రేలియా బౌలర్ సస్పెండ్ !
ఆస్ట్రేలియా పేసర్ మిచ్ క్లేడాన్ బాల్‌కి శానిటైజర్ ఉపయోగించాడని ఇటీవలే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా పేసర్ మిచ్ క్లేడాన్ బాల్‌కి శానిటైజర్ ఉపయోగించాడని ఇటీవలే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణలో భాగంగా ససెక్స్ కౌంటీ క్లబ్ అతడిని సస్పెండ్ చేసింది. ఆగస్టులో మిడిల్సెక్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో క్లేడాన్.. మూడు వికెట్లు దక్కించుకున్నాడు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో క్రికెట్లో కఠినమైన రూల్స్ విధించారు. బంతి మెరుపు కోసం ఉమ్మి ఉపయోగాన్ని నిషేధించారు.
Also Read :




