AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma House Scheme: ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!

Indiramma House Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో 15పైగా నియోజకవర్గాల్లో ఏడు వేలకి పైగా ఫ్లాట్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు దరఖాస్తులకు గడువు..

Indiramma House Scheme: ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
Indiramma House Scheme
Subhash Goud
|

Updated on: Aug 07, 2026 | 12:55 PM

Share

Indiramma House Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ హౌసింగ్‌ స్కీమ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. చాలా మంది ఇల్లుకట్టుకునే స్థోమత లేక అద్దె ఇళ్లల్లోనే జీవితాన్ని గడుుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కేవలం ఆరు లక్షల రూపాయలకే అందమైన ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాల్లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. మొదటి విడతలో 15పైగా నియోజకవర్గాల్లో ఏడు వేలకి పైగా ఫ్లాట్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు దరఖాస్తులకు గడువు తేదీని పొడిగించే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ ఇళ్ల మార్కెట్ విలువ 40 నుంచి 60 లక్షల వరకు ఉంటుంది. అర్హులైన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం.

వాట్సాప్ ద్వారా..

అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. మీ దగ్గరలోని మీసేవా కేంద్రానికి వెళ్లి లేదా నేరుగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు వాట్సాప్ ద్వారా కూడా చాలా సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికోసం 8096958096 నంబర్‌కు ఇంగ్లీషులో హాయ్ అని మెసేజ్ పంపి ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అని టైప్ చేయాలి. అప్లికేషన్ ఫీజుగా వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు 15 రూపాయలు డిపాజిట్ కింద యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో మీకు ఇల్లు రాకపోతే ఆ డబ్బులు వెంటనే మీ ఖాతాలో తిరిగి ఇస్తారు. ఒకవేళ ఇల్లు వస్తే ఆ డబ్బును మీరు చెల్లించాల్సిన మొత్తంలో కలుపుతారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కూకట్‌పల్లి లాంటి పదహారు ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ టవర్లు నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు ఆగస్టు చివరి వారంలో మొదలుపెట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు:

  • ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి కొన్ని అర్హతా ప్రమాణాలు ఇలా ఉన్నాయి:
  • దరఖాస్తుదారు కనీసం గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ లేదా CURE ప్రాంత నివాసి అయి ఉండాలి.
  • కుటుంబం మొత్తం వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
  • ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో కుటుంబంలోని ఏ సభ్యుని పేరు మీద కూడా వేరే ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ రిజిస్టర్ అయి ఉండకూడదు.
  • ఈ పథకం షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బీసీ), దివ్యాంగులు, పారిశుధ్య కార్మికులకు 50% సీట్లను రిజర్వ్ చేస్తుంది. అదనంగా ప్రతి కేటగిరీలో 30% ఫ్లాట్లు మహిళా సాధికారత కోసం రిజర్వ్ చేయబడ్డాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? నియమాలు ఏమిటి?

ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 10వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఆసక్తిగల పౌరులు తమ సమీపంలోని మీసేవా కేంద్రంలో అధికారిక వెబ్‌సైట్‌లో లేదా ప్రభుత్వం జారీ చేసిన వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. దరఖాస్తు రుసుము రూ.100. దీనితో పాటు రూ.10,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో పేరు రాకపోతే మొత్తం EMD సొమ్ము వాపసు ఇస్తారు.

ఎంపికైన అభ్యర్థులు రూ.6 లక్షల మొత్తాన్ని నాలుగు సులభ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. పారదర్శకతను నిర్ధారించడానికి, అన్ని దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ముఖ్యంగా ఫ్లాట్ పొందిన తర్వాత, లబ్ధిదారులు దానిని 10 సంవత్సరాల పాటు అమ్మడానికి లేదా అద్దెకు ఇవ్వడానికి వీలుండదు. అయితే బ్యాంకు నుండి గృహ రుణం పొందడానికి దానిని తాకట్టు పెట్టడానికి వారికి అనుమతి ఉంది.

ఇది కూడా చదవండి: IRCTC: ఇండియన్ రైల్వేస్ అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ. 3.46 లక్షలకే 10 రోజుల జపాన్ యాత్ర

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..
మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!