జైపూర్ :రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. ప్రస్తుతం ఆరెస్సెస్ రాజ్యేంగతర శక్తిగా వ్యవహరిస్తూ ప్రభుత్వంపై అజమాయిషీ చెలాయిస్తోందని విమర్శించారు. ఆరెస్సెస్ ఒక రాజకీయ పార్టీగా తన రూపాన్ని మార్చుకుని, బీజేపీలో విలీనమైపోవడం మంచిదని ఆయన అన్నారు. ఆరెస్సెస్ ఆమోదం లేకుండా బీజేపీ నుంచి ఏ ఒక్కరూ ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ అయ్యే పరిస్థితి లేదని అశోక్ గెహ్లాట్ అన్నారు.