నెరవేరిన 70 ఏళ్ల నాటికల.. లడఖ్‌లో సంబరాలు..

ఆర్టికల్ 370 రద్దుతో లడఖ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. దాదాపు 70 ఏళ్ల కాలం నుంచి ఎదురు చూస్తున్న తమ కల నెరవేరిందంటూ అక్కడి ప్రజలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. స్వీట్లు పంచుకుంటూ.. డ్యాన్సులు చేస్తున్నారు. ఇంతకాలానికి లడఖ్ ప్రజల కల నెరవేరిందని బుద్దిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కున్ జాంగ్ అన్నారు. ఈరోజు కోసం తామంతా ఎంతగానో ఎదురు చూశామని ఆయన చెప్పారు. జమ్ముకశ్మీర్ నుంచి విడిపోవాలని, తమ ప్రాంతాన్నని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని లఢఖ్ ప్రజలు 1949 నుంచి […]

నెరవేరిన 70 ఏళ్ల నాటికల.. లడఖ్‌లో సంబరాలు..
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 5:49 PM

ఆర్టికల్ 370 రద్దుతో లడఖ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. దాదాపు 70 ఏళ్ల కాలం నుంచి ఎదురు చూస్తున్న తమ కల నెరవేరిందంటూ అక్కడి ప్రజలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. స్వీట్లు పంచుకుంటూ.. డ్యాన్సులు చేస్తున్నారు. ఇంతకాలానికి లడఖ్ ప్రజల కల నెరవేరిందని బుద్దిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కున్ జాంగ్ అన్నారు. ఈరోజు కోసం తామంతా ఎంతగానో ఎదురు చూశామని ఆయన చెప్పారు. జమ్ముకశ్మీర్ నుంచి విడిపోవాలని, తమ ప్రాంతాన్నని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని లఢఖ్ ప్రజలు 1949 నుంచి ఎదురుచూపులు చూస్తున్నారని తెలిపారు. మరోవైపు శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే కూడా లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేశారు. 70% పైగా బౌద్ధులు లడఖ్‌లో నివసిస్తున్నారన్నారు రాణిల్. బౌద్ధ మెజారిటీ ఏర్పడ్డ మొట్ట మొదటి భారతీయ రాష్ట్రంగా లడఖ్ అవతరించిందని ఆయన చెప్పారు.