Army carry woman : దేశ రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడటమే కాదు.. అపదలో ఉన్న జనానికి అండ నిలుస్తున్నారు ఆర్మీ జవాన్లు. సరిహద్దులో ఉన్న జనం మధ్య ఉన్న నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తున్నారు. తాజాగా మంచు కురుస్తుండటంతో నవజాత శిశువుతో ఆసుపత్రిలో ఇరుక్కున్న బాలింతను భారత సైనికులు 6 కిలోమీటర్ల దూరం స్ట్రెచరుపై మోసుకెళ్లారు. ఆ మహిళను క్షేమంగా ఇంటికి చేర్చిన ఘటన జమ్మూకశ్మీరులోని కుప్వారాలో జరిగింది.
జమ్మూకశ్మీరులో జనవరి 3వతేదీ నుంచి భారీగా మంచు కురుస్తుండటంతో రోడ్లపై మంచు 10 అంగుళాల మేర పేరుకుపోయింది. దీంతో రోడ్లపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీ హిమపాతం మధ్య ఓ గర్భిణీ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. మంచు విస్తారంగా కురుస్తుండటంతో బాలింత, నవజాత శిశువును ఆసుపత్రి నుంచి ఇంటికి వాహనంలో తరలించలేకపోయారు. ఆమె ఇంటికి చేరేందుకు మార్గమే కనిపించకుండాపోయింది. ఇలాంటి సమయంలో ఆర్మీ జవాన్లు ముందుకు వచ్చారు. మంచు కురుస్తున్నా ఆసుపత్రిలోనే ఇరుక్కున్న బాలింతను సైనికులు స్ట్రెచరు మీద తీసుకొని 6 కిలోమీటర్ల దూరం మోసి ఇంటికి చేర్చారు. మంచుతుపానులోనూ తమకు సాయం అందించిన సైనిక సిబ్బందికి బాలింత కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | Indian Army personnel today carried a woman, who was stuck at a hospital with her newborn child due to heavy snowfall, on a stretcher for almost 6-km to take her to her home in Kupwara, Jammu & Kashmir. pic.twitter.com/Njng8jHYb5
— ANI (@ANI) January 23, 2021
Read Also… సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న హుస్సేన్ సాగర తీరం.. అలనాటి కళకు ఆధునిక రూపం ఇస్తున్న హెచ్‌ఎండీఏ