విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సిటీ సర్వీసులు.!

|

Sep 07, 2020 | 4:45 PM

అన్‌లాక్‌ 4.0లో భాగంగా ప్రజా రవాణాపై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయడంతో.. రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో సిటీ సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సిటీ సర్వీసులు.!
Follow us on

అన్‌లాక్‌ 4.0లో భాగంగా ప్రజా రవాణాపై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయడంతో.. రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో సిటీ సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ బస్సులను తిప్పాలని భావిస్తోంది. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డికి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. (City Bus Services In AP)

కరోనా నిబంధనలు పాటిస్తూనే హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం బస్సులను నడుపుతామని అందులో పేర్కొన్నారు. వైద్యశాఖ నుంచి అనుమతి రాగానే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అంతేకాకుండా మిగిలిన సర్వీసులను సైతం 50 శాతం వరకు తిప్పేందుకు ఏపీఎస్ఆర్టీసీ వ్యూహాలు రచిస్తోంది. (ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..)