Madireddy Pratap: వైఎస్సార్ లేకపోవడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైంది..

|

Jul 13, 2020 | 4:29 PM

Madireddy Pratap Comments: ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ లేకపోవడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని అన్నారు. సీఎం కొడుకును పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్లే జైలులో పెట్టారన్నారు. వైఎస్సార్ హయాంలో తాను ఐటీ శాఖ కార్యదర్శిగా పని చేశానన్న ప్రతాప్.. ఆ సమయంలో కొందరు అధికారులను బదిలీ చేసిన ఫైల్స్ పై విచారణ జరిగిందన్నారు.అందులో తనని మాత్రం విచారించలేదని.. అది తన ఇంటిగ్రిటి అని ప్రతాప్ పేర్కొన్నారు. తన బదిలీని ప్రభుత్వం […]

Madireddy Pratap: వైఎస్సార్ లేకపోవడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైంది..
Follow us on

Madireddy Pratap Comments: ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ లేకపోవడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని అన్నారు. సీఎం కొడుకును పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్లే జైలులో పెట్టారన్నారు. వైఎస్సార్ హయాంలో తాను ఐటీ శాఖ కార్యదర్శిగా పని చేశానన్న ప్రతాప్.. ఆ సమయంలో కొందరు అధికారులను బదిలీ చేసిన ఫైల్స్ పై విచారణ జరిగిందన్నారు.అందులో తనని మాత్రం విచారించలేదని.. అది తన ఇంటిగ్రిటి అని ప్రతాప్ పేర్కొన్నారు. తన బదిలీని ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పిన ఆయన.. అనేక కారణాలతో తన బదిలీ జరిగి ఉండొచ్చని.. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కాగా, సీఎం వైఎస్సార్ చనిపోయినపుడు ప్రయాణించిన హెలికాఫ్టర్ లో సుబ్రహ్మణ్యం బదులు రచ్చబండకు తాను వెళ్లాల్సి ఉందని.. సుబ్రమణ్యం తొలుత తనను వెళ్ళమని అడిగితే సరే అన్నానని.. మళ్లీ ఆయనే వద్దనటంతో తాను ఆగిపోయానని ప్రతాప్ వివరించారు. ఇది తనకు పునర్జన్మగా భావిస్తున్నానని ప్రతాప్ తెలిపారు.

Also Read:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!

ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!

ఏపీలోని ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ కఠిన లాక్‌డౌన్…

వారికి మళ్లీ కరోనా పరీక్షలు చేయండి.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..