ట్రాక్టర్ నడిపిన డాక్టర్‌కు మంత్రి ప్రశంసలు..

పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కరోనా మ‌ృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు డాక్టర్ శ్రీరామ్ చేసిన మహత్కార్యాన్ని మంత్రి హరీశ్‌ రావు కొనియాడారు.

ట్రాక్టర్ నడిపిన డాక్టర్‌కు మంత్రి ప్రశంసలు..
Follow us

|

Updated on: Jul 13, 2020 | 4:33 PM

పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కరోనా మ‌ృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు డాక్టర్ శ్రీరామ్ చేసిన మహత్కార్యాన్ని మంత్రి హరీశ్‌ రావు కొనియాడారు. పెద్దపల్లిలో కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది వదిలేసి వెళ్లగా..డాక్టర్ శ్రీరామ్ ట్రాక్టర్‌లో తరలించిన ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ… ట్విట్టర్ వేదికగా అభినందించారు.

‘‘డాక్టర్ శ్రీరామ్‌ గారూ… మనుషుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారు. మానవత్వంలోనే దైవత్వం దర్శించుకునేలా చేశారు. కరోనాపై యుద్ధం చేస్తున్నఅందరికీ మీరు స్ఫూర్తి. ఈ కష్టకాలంలో ప్రజారోగ్య రక్షణకు పాటు పడుతున్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో కోవిడ్ బారిన పడి మృతిచెందిన వ్యక్తికి వైద్యులే దగ్గరుండి దహనకార్యక్రమాలు నిర్వహించారు. సుల్తానాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీరామ్ పీపీఈ కిట్టు ధరించి మ‌ృతదేహన్ని తరలించేందుకు ట్రాక్టర్ నడిపారు. సిబ్బందితో కలిసి మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు డాక్టర్ అక్కడే అనంతరం ఆస్పత్రికి వెళ్లారు. మానవత్వం చాటుకున్న డాక్టర్ శ్రీరామ్‌ ఔదర్యానికి స్థానికులు ఎంతగానో ప్రశంసించారు. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావటంతో నెటిజన్లు సైతం వైద్యుడి ఉదారతను అభినందిస్తూ..కామెంట్లు, లైకులు చేస్తున్నారు.