గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి

గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల తొలివారంలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక విడుదలైన ఫలితాలను  http://gramasachivalayam.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 1,34,524 పోస్టులకు గానూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా.. దాదాపు 21.5 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 19.74 […]

Ravi Kiran

|

Sep 19, 2019 | 1:57 PM

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల తొలివారంలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక విడుదలైన ఫలితాలను  http://gramasachivalayam.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా 1,34,524 పోస్టులకు గానూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా.. దాదాపు 21.5 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎన్నికైన అభ్యర్థులకు ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీల్లో శిక్షణ ఇస్తారు. కాగా అక్టోబర్ 2 నుంచి ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొబేషనరీ కాలం ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.15వేలు చొప్పున వేతనం చెల్లించనున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu