గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు.!

|

Sep 04, 2020 | 2:46 PM

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్ధులకు ముఖ్య గమనిక. రాత పరీక్షలకు ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు.

గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు.!
Follow us on

AP Secretariat Exams Hall Tickets: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్ధులకు ముఖ్య గమనిక. రాత పరీక్షలకు ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఉదయం, మధ్యాహ్నం ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి కోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎంఆర్ షీట్లల ముద్రణ వంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొత్తం 16,208 పోస్టులకు సుమారు 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ రాత పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మూడు నుంచి ఐదు వేల పరీక్షా కేంద్రాలలో.. అభ్యర్ధుల మధ్య తగిన దూరం ఉండటంతో పాటు.. ఒక గదిలో 16 మంది చొప్పున సీటింగ్ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

హాల్‌టికెట్ల కోసం http://gramasachivalayam.ap.gov.in/ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

రాతపరీక్షల షెడ్యూల్ ఇలా..

  • సెప్టెంబర్ 20: పంచాయతీ కార్యదర్శి, మహిళా పొలిసు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్( మార్నింగ్), డిజిటల్ అసిస్టెంట్(మధ్యాహ్నం)
  • సెప్టెంబర్ 21: వీఅర్వో, విలేజ్ సర్వేయర్(మార్నింగ్), ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ(మధ్యాహ్నం)
  • సెప్టెంబర్ 22: వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ(మార్నింగ్), వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ(మధ్యాహ్నం)
  • సెప్టెంబర్ 23: విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(మార్నింగ్), వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ(మధ్యాహ్నం)
  • సెప్టెంబర్ 24: వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీ(మార్నింగ్), ఏఎన్ఎం/ వార్డు హెల్త్ సెక్రటరీ(మధ్యాహ్నం)
  • సెప్టెంబర్ 25: విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్(మార్నింగ్), విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్(మధ్యాహ్నం)
  • సెప్టెంబర్ 26: విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్(మార్నింగ్), విలేజ్ యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్(మధ్యాహ్నం)