
ఏపీ పాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూలును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. పొడిగిస్తున్న విషయాన్ని ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పొడిగించిన గడువు తేదీలు ఇలా ఉన్నాయి.
పాలిసెట్‌లో 60,780 మంది అర్హత సాధించగా శనివారం వరకు 35,346 మంది వెబ్ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ అయ్యారు. 34,288 మంది ధ్రువపత్రాల పరిశీలన జరగగా, 28,682 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.