మహిళా ఓట్లు టీడీపీని గెలిపిస్తాయి- గంటా

సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైనా మహిళలు ఓపికతో ఓటు వేశారన్నారు ఏపీ మంత్రి గంటా. అర్థరాత్రి అయినా క్యూ లో నిలబడి ఓటేయడానికి కారణం చంద్రబాబేనని అన్నారు.  మహిళా ఓట్లు మొత్తం తెలుగుదేశంకే పడ్డాయన్నారు.  విశాఖలో నిర్వహించిన  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. 2009 ఎన్నికల్లో కూడా ఈవీఎంల గురించి చెప్పామని గుర్తుచేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయించడంతో రాత్రంతా […]

మహిళా ఓట్లు టీడీపీని గెలిపిస్తాయి- గంటా

Edited By:

Updated on: Apr 15, 2019 | 6:21 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైనా మహిళలు ఓపికతో ఓటు వేశారన్నారు ఏపీ మంత్రి గంటా. అర్థరాత్రి అయినా క్యూ లో నిలబడి ఓటేయడానికి కారణం చంద్రబాబేనని అన్నారు.  మహిళా ఓట్లు మొత్తం తెలుగుదేశంకే పడ్డాయన్నారు.  విశాఖలో నిర్వహించిన  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. 2009 ఎన్నికల్లో కూడా ఈవీఎంల గురించి చెప్పామని గుర్తుచేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయించడంతో రాత్రంతా పోలింగ్ జరిగిందన్నారు. ఇక ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించిన గంటా.. ఈ రోజు దేశం ప్రమాదస్థాయిలో ఉంది కాబట్టే.. కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈవీఎంలు ఎలా ట్యాపరింగ్‌ చేయొచ్చో త్వరలో కూలంకుషంగా వివరిస్తామని ప్రకటించారు గంటా శ్రీనివాసరావు.

Loading...
Unable to load recommendations.
Follow Us