అదే జరిగితే వెంటనే రాజీనామా ఏపీ మంత్రి శపథం

రైతుల ఉచిత విద్యుత్‌కి ఎటువంటి విఘాతం కలగదని శపథం చేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎట్టి పరిస్థితిలో కరెంట్ వాడుకున్నందుకు రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదని ఆయన తేల్చి చెప్పారు. రైతులు ఒక్క రూపాయి కట్టే పరిస్థితి..

అదే జరిగితే వెంటనే రాజీనామా ఏపీ మంత్రి శపథం
Pardhasaradhi Peri

|

Sep 02, 2020 | 6:53 PM

రైతుల ఉచిత విద్యుత్‌కి ఎటువంటి విఘాతం కలగదని శపథం చేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎట్టి పరిస్థితిలో కరెంట్ వాడుకున్నందుకు రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదని ఆయన తేల్చి చెప్పారు. రైతులు ఒక్క రూపాయి కట్టే పరిస్థితి వస్తే తన మంత్రి పదవి వదులుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణల విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ,లేనిపోని అపోహలు సృష్టించి రైతన్నలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. మహానేత వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పధకం ఎట్టి పరిస్థితిలో ఆపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఆనాడు ఉచిత విద్యుత్ గురించి వైఎస్సార్‌ మాట్లాడితే తీగల మీద బట్టలు ఆరవేసుకోవాల్సిందే అని చంద్రబాబు ఎద్దేవా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాలినేని గుర్తుచేశారు. రైతుల ఖాతాల్లో ముందుగానే డబ్బులు జమచేసి ఆ బిల్లు డబ్బును డిస్కం ఖాతాలో జమచేయడం ద్వారా రైతులకు ఎటువంటి నష్టం లేదని మంత్రి పేర్కొన్నారు. కాగా, జగన్ సర్కారు తెస్తోన్న ఈ కొత్త విధానం ద్వారా ఇంతకాలం విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఇక నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది. ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయదారులు ఎంత కరెంట్‌ వాడుకున్నా ఇబ్బంది ఉండదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోన్న సంగతి తెలిసిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu