పారిశ్రామిక విప్లవానికి వినూత్నమైన ప్లాన్.. వివరాలు అదుర్స్ !
పారిశ్రామిక రంగంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ రూపొందించే పనిలో పడింది ఏపీ పరిశ్రమలు వాణిజ్య శాఖ. ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా బిల్డింగ్ బ్రాండ్ ఏపీ కోసం “ఏపీ బ్రాండ్ థాన్” కార్యక్రమాన్ని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు. ఏపీ బ్రాండ్ థాన్ పోస్టర్ ఆవిష్కరించారు మంత్రి. ఏపీ బ్రాండ్ థాన్ కార్యక్రమం ద్వారా బ్రాండ్ ఏపిని తయారు చేయడానికి యువత నుంచి సలహాలు,సూచనను రాష్ట్ర […]
పారిశ్రామిక రంగంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ రూపొందించే పనిలో పడింది ఏపీ పరిశ్రమలు వాణిజ్య శాఖ. ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా బిల్డింగ్ బ్రాండ్ ఏపీ కోసం “ఏపీ బ్రాండ్ థాన్” కార్యక్రమాన్ని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు. ఏపీ బ్రాండ్ థాన్ పోస్టర్ ఆవిష్కరించారు మంత్రి. ఏపీ బ్రాండ్ థాన్ కార్యక్రమం ద్వారా బ్రాండ్ ఏపిని తయారు చేయడానికి యువత నుంచి సలహాలు,సూచనను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. గురువారం నుంచి అక్టోబర్ 28 రాత్రి 11 గంటలవరకు బిల్డింగ్ బ్రాండ్ ఏపి కోసం వెబ్ పోర్టల్ లో సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం కల్పించారు. అత్యుత్తమమైన మూడు ఎంట్రీ లకు నగదు పురస్కారాలను ప్రకటించారు. పురస్కారం వివరాలు:
(1) మొదటి బహుమతి 50 వేలు
(2) రెండవ బహుమతి 25 వేలు
(3) మూడవ బహుమతి 10 వేలు
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గౌతంరెడ్డి ఏపీలో నూతన పారిశ్రామిక విధానం తీసుకురావాలని చూస్తున్నామని, రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులపై దృష్టి సారించామని చెప్పారు.