రైల్వే ప్రయాణికులకు ఊరట.. నెలకు 12 టికెట్లు మాత్రమే..!
ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. తప్పని సరి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే.. టికెట్లు బుక్ చేసుకునే వారికి ఇక ఆ అవసరం లేదు. టికెట్ కన్పార్మ్ అవుతుందో లేదో అని టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. నెలకు 12 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. కుటుంబంతో కలిసి ట్రైన్ లో జర్నీ చేసేవారికి, ఫ్రెండ్స్‌లో గుంపుగా హాలిడే ట్రిప్‌కు వెళ్లేవారికి ఇది మంచి […]
ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. తప్పని సరి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే.. టికెట్లు బుక్ చేసుకునే వారికి ఇక ఆ అవసరం లేదు. టికెట్ కన్పార్మ్ అవుతుందో లేదో అని టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. నెలకు 12 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. కుటుంబంతో కలిసి ట్రైన్ లో జర్నీ చేసేవారికి, ఫ్రెండ్స్‌లో గుంపుగా హాలిడే ట్రిప్‌కు వెళ్లేవారికి ఇది మంచి అవకాశం.
అయితే చాలా మంది ఒకే ట్రాన్సాక్షన్‌పైనే అన్ని టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా ఒక ఐఆర్‌సీటీసీ అకౌంట్ ద్వారా ఆరు టికెట్లను మాత్రమే బుక్ చేసుకోగలం. ఇప్పటినుంచి అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసుకుంటే ఒక వ్యక్తి గరిష్టంగా 12 టికెట్ల వరకు బుకింగ్ చేసుకోవచ్చు. 6 మందికి పైన ప్యాసింజర్లకు టికెట్లు బుక్ చేసుకోవాలంటే.. మాస్టర్ లిస్ట్‌లో యాడ్ చేసిన ప్యాసింజర్లలో ఒక్కరి ఆధార్ అయినా వెరిఫై అయ్యి ఉంటే సరిపోతుంది.
ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లోని లాగిన్ అయిన తర్వాత మై అకౌంట్ ట్యాబ్‌లో లింక్ యువర్ ఆధార్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఓటీపీ సాయంతో ఆధార్‌ను అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి. ఆధార్ లింక్ అయిన మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. తర్వాత అకౌంట్ నుంచి బయటకు వచ్చి మళ్లీ లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవాలి. ఇతర ప్రయాణికుల పేర్లను మాస్టర్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల అక్కడే వారి ఆధార్ కూడా వెరిఫై చేసుకోవచ్చు.