జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు..

|

Jul 08, 2020 | 12:37 PM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపధ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు..
Follow us on

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపధ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. జైళ్లలో ఉన్న ఖైదీలు కరోనా బారిన పడుతుండటం వల్ల జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం స్పెషల్‌ జైళ్లకు తరలించాలంది.

ఈ స్పెషల్ జైళ్లలో కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్‌ను పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జైళ్లలో టెస్టులు చేసేందుకు ఒక మెడికల్‌ అధికారితో పాటు.. పారా మెడికల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఖైదీలను వెంటనే కోవిడ్ ఆస్పత్రికి తరలించే విధంగా.. నెగెటివ్‌ వచ్చిన ఖైదీని మాత్రమే సాధారణ జైలుకు తరలించేలా ఉత్తర్వులు జారీ చేసింది. అటు జైలు సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. కాగా, ఈ స్పెషల్ జైళ్ల నుంచి ఖైదీలు పారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Also Read:

ఏపీ ఎంసెట్.. విద్యార్ధులకు చివరి అవకాశం… నేడే ఆఖరు తేదీ..

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!