టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నుంచి సగం వేతనాలు అందుకుంటున్న వారికి జూన్ నెల కోత లేకుండా పూర్తి వేతనం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ముగియడం.. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుకావడంతో. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడింది. దీనితో ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెల పూర్తి వేతనాలు చెల్లించడంతో.. ఆర్టీసీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సంస్థలో […]

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
Follow us

|

Updated on: Jul 07, 2020 | 8:26 AM

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నుంచి సగం వేతనాలు అందుకుంటున్న వారికి జూన్ నెల కోత లేకుండా పూర్తి వేతనం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ముగియడం.. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుకావడంతో. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడింది.

దీనితో ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెల పూర్తి వేతనాలు చెల్లించడంతో.. ఆర్టీసీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సంస్థలో పని చేస్తున్న 49,733 మంది సిబ్బంది జీతాలకు గానూ సుమారు రూ. 160 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనిపై అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.