సీమ గొంతు త‌డిపేందుకు జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం…ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటు

|

Jun 26, 2020 | 10:31 PM

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు వెలువ‌రించింది.

సీమ గొంతు త‌డిపేందుకు జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం...ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటు
Follow us on

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్ పేరిట ఓ ఎస్పీవీని ఏర్పాటు చేయ‌నున్నారు. వందశాతం ప్రభుత్వ నిధులతో ఈ ప్రత్యేక వాహక సంస్థ ప‌నిచెయ్య‌నుంది. కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో ఈ ఎస్పీవీని(స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్) రిజిస్టర్ చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారుల‌ను ఆదేశించింది. ఈ ప్రత్యేక వాహక సంస్థకు తొలిగా జలవనరుల శాఖ నుంచి 5 కోట్ల పెట్టుబడి ధనాన్ని మంజూరు చేయాల‌ని ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి.

రాయలసీమ ప్రాంతానికి నీటి లభ్యతను పెంచేందుకు నిర్దేశించిన 27 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై ఈ ప్రత్యేక వాహక సంస్థ పనిచేయనుంది. అంతేకాదు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ ద్వారా 40 వేల కోట్ల రూపాయల మేర ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.