విజయవాడ, విశాఖలలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్..?

దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో అన్ని రంగాలు కూడా ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీలోని కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు మినహా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా.. తెలంగాణకు మాత్రం బస్సులు సర్వీసులు తిప్పేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ బస్సులను తిప్పుతోంది. అయితే తాజాగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో సిటీ సర్వీసులను నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ […]

విజయవాడ, విశాఖలలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్..?
Follow us

|

Updated on: Jun 26, 2020 | 1:14 PM

దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో అన్ని రంగాలు కూడా ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీలోని కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు మినహా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా.. తెలంగాణకు మాత్రం బస్సులు సర్వీసులు తిప్పేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ బస్సులను తిప్పుతోంది. అయితే తాజాగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో సిటీ సర్వీసులను నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ బస్సులను తిప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట. నగరంలోని అన్ని ప్రాంతాలకు టికెట్ ధరలు ఒకే విధంగా ఉండేలా నిర్ణయించి సర్వీసులు పునరుద్దరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీసులు నడపనున్నారట. రాష్ట్రంలో రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరుగుతుండటం తగిన జాగ్రత్తలు తీసుకుని బస్సు సర్వీసులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటిన సంగతి విదితమే.