కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..
కర్నూలు జిల్లాలోని కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎమ్మెల్యే సుధాకర్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, నీరసంతో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే కోవిడ్ లక్షణాలు ఉండటంతో.. కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈ పరీక్షల్లో ఆయనికి కోవిడ్ పాజిటివ్‌గా...

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ విపరీతంగా పెరిగిపోతుంది. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత.. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, సీనిమా, సీరియల్ రంగం, మీడియా రంగం, రాజకీయ నాయకుల్లో సైతం కోవిడ్ కలవరం పుట్టిస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలోని కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎమ్మెల్యే సుధాకర్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, నీరసంతో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే కోవిడ్ లక్షణాలు ఉండటంతో.. కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈ పరీక్షల్లో ఆయనికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో కె.నాగలాపురం దగ్గర ఉన్న విశ్వభారతి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు ఎమ్మెల్యేని తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యేకు కరోనా రావడంతో ఆయనతో కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులకు, పలువురికి కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.
Read More:
వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..



