బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ విపరీతంగా పెరిగిపోతుంది. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత.. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఏం చేయాలన్నా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు అన్ని రంగాలపై కరోనా వైరస్ విశ్వరూపం...

  • Updated On - 12:21 pm, Fri, 26 June 20 Edited By:
బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ విపరీతంగా పెరిగిపోతుంది. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత.. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఏం చేయాలన్నా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు అన్ని రంగాలపై కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా రంగంపై, రాజకీయ నాయకుల్లో సైతం కోవిడ్ కలవరం పుట్టిస్తోంది. ఇటీవల దీని ప్రభావం బుల్లితెర రంగంపై పడింది.

తాజాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తెలుగు టీవీ సీరియల్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే కదా. అప్పటికీ చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగ్స్ స్టార్ట్ చేశారు. ఇదివరకే ఓ సీరియల్ నటుడికి కరోనా వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో సీరియల్ నటుడు హరికృష్ణకు కూడా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హరికృష్ణ ప్రస్తుతం గృహలక్ష్మీ సీరియల్‌లో‌ నటిస్తున్నాడు. ఈ బుల్లితెర సీరియల్‌లోనే అలనాటి నటి కస్తూరి కూడా నటిస్తోన్న విషయం తెలసిందే.

హరికృష్ణకి కరోనా అని తేలడంతో ఇవాళ జరాగాల్సిన షూటింగ్‌ను రద్దు చేశారు నిర్మాత. ఇటీవలే కరోనా సోకిన ప్రభాకర్‌తో హరికృష్ణ కాంటాక్ట్ అయ్యాడు. అయితే ప్రభాకర్‌తో సన్నిహితంగా మెలిగిన 33 మందికి సంబంధించిన రిపోర్టులు రాకముందే షూటింగ్ మొదలు పెట్టారు. ఇక ఇన్సూరెన్స్ చేయించడంలోనూ అలసత్వం పాటించడంతో టీవీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More: వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..