AP Government: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

|

Mar 10, 2020 | 10:47 PM

AP Government New Scheme: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్‌కిన్స్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. ఈ పథకాన్ని లాంచ్ చేసే ముందు పైలట్ ప్రాజెక్ట్‌గా మొదట కొన్ని గవర్నమెంట్ స్కూళ్లలో ఏర్పాటు చేయనుండగా.. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్ల అన్నింటిలోనూ వీటిని ఏర్పాటు […]

AP Government: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్...
Follow us on

AP Government New Scheme: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్‌కిన్స్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.

ఈ పథకాన్ని లాంచ్ చేసే ముందు పైలట్ ప్రాజెక్ట్‌గా మొదట కొన్ని గవర్నమెంట్ స్కూళ్లలో ఏర్పాటు చేయనుండగా.. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్ల అన్నింటిలోనూ వీటిని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హిందూస్తాన్ లివర్ కంపెనీ సహకారంతో జగన్ సర్కార్ ఈ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనుండగా.. కేంద్రం చేపట్టిన ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే కేంద్రంతో చర్చలు జరిపారని తెలుస్తోంది.

ఇక ఈ వెండింగ్ మిషన్లలో రూపాయి వేస్తే.. శానిటరీ నాప్‌కిన్ వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం ఏర్పాటు చేసిన జనఔషధి దుకాణాల్లో ఈ నాప్‌కిన్స్ ధర 4 రూపాయలు కాగా.. ఏపీ సర్కార్ దీనిని కేవలం రూపాయికే స్కూల్ విద్యార్థినులకు అందజేయాలని నిర్ణయించింది. త్వరలో ప్రారంభం కానున్న విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

For More News:

సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్

నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…

విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం…

కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?

ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..

తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..

నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..

కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?

కోహ్లీ, రోహిత్‌ల కంటే.. రాహులే ది బెస్ట్..