ఏపీలో కొత్త ‘ఇండస్ట్రియల్‌ పాలసీ’ వచ్చేసింది

ఏపీలో కొత్త 'ఇండస్ట్రియల్‌ పాలసీ' వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో  కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వచ్చేసింది. ఈ పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా...

Sanjay Kasula

|

Aug 10, 2020 | 12:37 PM

AP Government Launched New Industrial Policy : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో  కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వచ్చేసింది. ఈ పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా విడుదల చేశారు. ఈ పాలసీ 2020-2023 వరకు అమలులో ఉంటుంది. సీఎ వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు.

పెట్టుబడులకు ప్రాధాన్యత..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించారు. వైఎస్సార్‌ ఏపీ వన్ పేరుతో మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యతను ఇచ్చారు. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్‌ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా రాయితీలు కల్పిస్తారు.

‘ఇండస్ట్రియల్‌ పాలసీ’తో ఉపయోగాలు..

పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులిచ్చేలా చర్యలు తీసుకుంటారు. భూముల కేటాయింపు, స్టాంప్ డ్యూటీ, రాష్ట్ర జీఎస్టీ, నాలా ఛార్జీలు, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ అంశాలపై స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేయనున్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రెండు స్కిల్ వర్సిటీలు, డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ల సమ్మిళితం కానున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu