దొనకొండపై రోజుకో మాట.. అమరావతిపై అదే ‘పాట’

దొనకొండపై రోజుకో మాట.. అమరావతిపై అదే 'పాట'

ఏపీ రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలించే యోచనలో జగన్ సర్కారు ఉందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో దొనకొండ అంశం తెరపైకి వచ్చింది. అటు ప్రభుత్వం కూడా దొనకొండ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజధానిని చేస్తారా లేదా అనేది పక్కన పెడితే.. ఇప్పటికే అక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది ఇలా ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీలోని […]

Ravi Kiran

|

Aug 25, 2019 | 11:26 AM

ఏపీ రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలించే యోచనలో జగన్ సర్కారు ఉందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో దొనకొండ అంశం తెరపైకి వచ్చింది. అటు ప్రభుత్వం కూడా దొనకొండ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజధానిని చేస్తారా లేదా అనేది పక్కన పెడితే.. ఇప్పటికే అక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది ఇలా ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీలోని అన్ని ప్రాంతాలను పూర్తిగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. ఇందులో భాగంగా దొనకొండలో 2,450 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట.

రాజధాని కాదు.. ఇండస్ట్రియల్ హబ్…

దొనకొండను రాజధానిగా కాకుండా పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దెందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఇక్కడ 2,450 ఎకరాల భూమిని గుర్తించి అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యాయం చేస్తోందట. దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా ఏర్పాటుచేసేందుకు ఐదువేల ఎకరాలు అవసరం అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఆ మేరకు భూమిని సమీకరించే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకుంటోంది. వాస్తవానికి దొనకొండను పారిశ్రామిక కారిడార్ చేయాలని గతంలో కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే అనుకోని కారణాల వల్ల అది కాస్తా జరగలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళాలని జగన్ సర్కార్ కంకణం కట్టుకుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu