అప్పుడు ఇప్పడు ఉన్నది వారే… శ్వేతపత్రాల విడుదలపై చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయలని నిర్ణయించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు స్వాగతించారు. గతంలో తాముకూడా ఇలాగే శ్రేతపత్రాలు విడుదల చేశామని గుర్తుచేశారు బాబు. తమ ప్రభుత్వం హాయంలో ఉన్న అధికారులు, ఇప్పుడున్న అధికారులు ఒక్కరేనని శ్వేతపత్రాల సమాచారాన్ని ఇచ్చింది కూడా వారేనని తెలిపారు. ప్రస్తుతం పాలకులకు-అధికారులకు మధ్య సమన్వయలోపం ఉందని, నీటి ఉధృతి ఉన్నప్పటికీ పట్టిసీమకు నీళ్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. సాగునీటి విషయంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని, గతంలో తాము […]
ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయలని నిర్ణయించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు స్వాగతించారు. గతంలో తాముకూడా ఇలాగే శ్రేతపత్రాలు విడుదల చేశామని గుర్తుచేశారు బాబు. తమ ప్రభుత్వం హాయంలో ఉన్న అధికారులు, ఇప్పుడున్న అధికారులు ఒక్కరేనని శ్వేతపత్రాల సమాచారాన్ని ఇచ్చింది కూడా వారేనని తెలిపారు. ప్రస్తుతం పాలకులకు-అధికారులకు మధ్య సమన్వయలోపం ఉందని, నీటి ఉధృతి ఉన్నప్పటికీ పట్టిసీమకు నీళ్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. సాగునీటి విషయంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుకు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకున్నామని చంద్రబాబు తెలిపారు.
గురువారం నుంచి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా వైసీపీ ప్రభుత్వం తాజాగా శ్వేతపత్రాలను విడుదలను ప్రారంభించింది. గత ప్రభుత్వ హయంలో తీసుకున్న నిర్ణయాలు, ఒప్పందాలు, పథకాలపై ప్రత్యేక దృష్టిని సారించడంతో వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.