మా పార్టీ బీజేపీలో విలీనమవుతుంది.. టీడీపీ నేత హాట్ కామెంట్స్

టీడీపీ నుంచి ఒక్కొక్కరు బీజేపీలో చేరిపోతుండటంతో ఆపార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ దశలో అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. త్వరలోనే తమ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని, మేమే మళ్లీ బీజేపీతో తాళి కట్టించుకుంటామని, బీజేపీతోనే కాపురం చేస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీ-టీడీపీల మధ్య సంబంధాన్ని వైవాహిక బంధంతో పోల్చిన ప్రభాకర్‌రెడ్డి ఈ విధమైన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో […]

మా పార్టీ బీజేపీలో విలీనమవుతుంది.. టీడీపీ నేత  హాట్ కామెంట్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 11, 2019 | 3:33 PM

టీడీపీ నుంచి ఒక్కొక్కరు బీజేపీలో చేరిపోతుండటంతో ఆపార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ దశలో అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. త్వరలోనే తమ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని, మేమే మళ్లీ బీజేపీతో తాళి కట్టించుకుంటామని, బీజేపీతోనే కాపురం చేస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీ-టీడీపీల మధ్య సంబంధాన్ని వైవాహిక బంధంతో పోల్చిన ప్రభాకర్‌రెడ్డి ఈ విధమైన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, ప్రస్తుతం చంద్రబాబు ఐడియాలు మోదీకి చాల అవసరమంటూ వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత చాలామంది టీడీపీ నేతలు బీజేపీ గూటికి చేరుతున్నారు. ఈ నేపధ్యంలో జేసీ సోదరులు కూడా బీజేపీలోకి వెళ్తున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ సమయంలో ఏకంగా తమ పార్టీ.. బీజేపీలో విలీనం కాబోతుందని బాంబు పేల్చారు ప్రభాకర్‌రెడ్డి. మరి ఈ సీనియర్ నేత వ్యాఖ్యలపై పార్టీ అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.