Ap Corona Cases : ఏపీలో కొత్తగా 305 కరోనా పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే..?

|

Dec 14, 2020 | 5:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కొత్తగా 44,935 సాంపిల్స్ టెస్ట్ చేయగా..305 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 875836 కు చేరింది.

Ap Corona Cases : ఏపీలో కొత్తగా 305 కరోనా పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే..?
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కొత్తగా 44,935 సాంపిల్స్ టెస్ట్ చేయగా..305 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 875836 కు చేరింది. కొత్తగా మరో ఇద్దరు వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఈ రెండు మరణాలు కూడా నెల్లూరు జిల్లాలోనే సంభవించాయి.  దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 7059కు చేరింది. రాష్ట్రంలో  4728 యాక్టీవ్ కేసులున్నాయి. కొత్తగా 541 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 864049 కు చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 1,08,75,925 సాంపిల్స్ టెస్టు చేసినట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది.

అయితే వ్యాధి వ్యాప్తి తగ్గినంత మాత్రాన..నిర్లక్ష్య ధోరణితో వ్యవరించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు.

Also Read :

డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్

ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు..పూర్తి విధానం ఇదే..రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్

ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు