AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా బాలుకు భారతరత్న ఇవ్వండి..

50 ఏళ్లుకుపైగా కెరీర్‌.. 50వేలకుపైగా పాటలు.. అంటే సగటున ఏడాదికి వెయ్యిపాటలు. మూడు తరాలను ఓలలాడించిన అమరగాయకుడు. అది కూడా 16 భాషాల్లో. బాలు ది జస్ట్ నాట్‌ ఏ రికార్డ్‌.. ఇట్స్‌ ఏ ఆల్‌ టైమ్ రికార్డ్‌. అందుకే లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

మా బాలుకు భారతరత్న ఇవ్వండి..
Sanjay Kasula
|

Updated on: Sep 28, 2020 | 6:28 PM

Share

ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన  సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా బాలుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. నెల్లూరులో పుట్టి.. చెన్నైలో స్థిరపడినా ఆసేతుహిమాచలాన్నే తన స్వర నివాసం చేసుకున్న బాలుకి భరతరత్న ఇవ్వడం సబబు అంటూ జగన్‌.. మోదికి విజ్ఞప్తి చేశారు. లేఖలో ఆయన పలు భాషల్లో పాడిన పాటలు, పద్మభూషణ్, జాతీయ, ఫిల్మ్‌వేర్ అవార్డుల విషయాలను జగన్ ప్రస్తావించారు.

ఎస్పీ బాలు ఎంతో మంది వర్ధమాన గాయకులను పరిచయం చేయడంతో పాటు 50 సంవత్సరాల పాటు సంగీత ప్రేమికులను అలరించారని ప్రధానికి సీఎం జగన్ రాసిన లేఖలో పేర్కొన్నారు. మాతృభాషలో 40వేలకు పైగా పాటుల పాడి, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో కూడా ఎన్నో గీతాలను ఆలపించారని అన్నారు.

ఆరు జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25నంది అవార్డులతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అనేక అవార్డులు పొందారని గుర్తు చేశారు. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, పద్మభూషన్ 2011లో బాలుకు ప్రదానం చేసిందని వెల్లడించారు.

ప్రముఖ నేపధ్య గాయకులయిన లతా మంగేష్కర్, భుపెన్ హజారిక, ఎమ్మెస్ సుబ్బలక్ష్మీ, బిస్మిల్లా ఖాన్, భీమ్‌సేన్ జోషిలకు భారతరత్న అవార్డులు భారత ప్రభుత్వం అందజేసింది. ఐదు దశాబ్ధాల పాటు గాయకుడిగా అలరించిన బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము’ అని లేఖలో జగన్ వివరించారు.

సీఎం జగన్ మాత్రమే కాదు.. గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి భారత రత్న ఇవ్వాలని హీరో అర్జున్ డిమాండ్ చేశారు. ఇందుకోసం తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ ఇండస్ట్రీకి చెందిన వాళ్లంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. సుమారు నాలుగు దశాబ్ధాలకుపైగా ప్రేక్షకుల్ని తన గానామృతంతో కట్టిపడేసిన వ్యక్తి ఎస్పీ బాలు అని అర్జున్ అభిప్రాయాపడ్డారు.

భారతరత్న డిమాండ్‌పై ఎస్పీ చరణ్‌ కూడా స్పందించారు. నాన్నకు భారతరత్న ఇస్తే మంచిదే. తీసుకుంటాం. ఒకవేళ ఇవ్వకపోయినా.. మా నాన్న భారతరత్నే. ఆయనో లెజండ్ అంటూ కాసేపటిక్రితం స్పందించారు చరణ్‌.