ఏపీ బిజెపి కొత్త డిమాండ్.. టార్గెట్ ఆ ఇద్దరేనా?
ఏపీ బీజేపీ నేతలు అందుకున్న కొత్త పల్లవి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన సిబిఐ కోర్టును విజయవాడకు తరలించాలని ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్రంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. సో.. ఏపీ బీజేపీ నేతల డిమాండ్‌ను ఆమోదించే అవకాశాలు కూడా పుష్కలంగా వున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా వున్నప్పుడు రాజధాని హైదరాబాద్‌లో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులను హైదరాబాద్ […]
ఏపీ బీజేపీ నేతలు అందుకున్న కొత్త పల్లవి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన సిబిఐ కోర్టును విజయవాడకు తరలించాలని ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్రంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. సో.. ఏపీ బీజేపీ నేతల డిమాండ్‌ను ఆమోదించే అవకాశాలు కూడా పుష్కలంగా వున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా వున్నప్పుడు రాజధాని హైదరాబాద్‌లో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులను హైదరాబాద్ కేంద్రంగా వున్న సిబిఐ కోర్టులోనే విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ నేతలు కొత్త డిమాండ్ వినిపించడం మొదలుపెట్టారు. హైదరాబాద్ సిబిఐ కోర్టును రెండుగా విభజించి, ఏపీకి సంబంధించిన కేసులతో కలిపి విజయవాడలో సిబిఐ కోర్టు ఏర్పాటు చేయాలనేది ఏపీ బీజేపీ నేతల తాజా డిమాండ్.
ప్రస్తుత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సిబిఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రతీ వారం జగన్ సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి వుంటుంది. కానీ, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతీ వారం రాలేనని, తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ సిబిఐ కోర్టును కోరారు. కానీ కోర్టు దాన్ని తోసిపుచ్చింది. దాంతో ప్రతీ వారం జగన్ తరపు న్యాయవాది కోర్టులో మినహాయింపు తీసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో సిబిఐ కోర్టును ఏర్పాటు చేస్తే జగన్ మినహాయింపు కోరే అవకాశాలు, కారణాలు తగ్గిపోతాయి. ఆయన ఒక వారం కాకపోయినా మరోవారం సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది. సో.. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగానే ఏపీ బీజేపీ నేతలు బెజవాడలో సిబిఐ కోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారని చెప్పుకుంటున్నారు.
ఇంకోవైపు చంద్రబాబు అక్రమాస్తుల కేసు మరోసారి తెరమీదికి వస్తోంది. దానికి తోడు గత అయిదేళ్ళ కాలంలో జరిగిన అక్రమాలను తవ్వే పనిలో అటు వైసీపీ, ఇటు బిజెపి నేతలున్నారు. వాటిలో ఏది జరిగినా.. చంద్రబాబుపై వచ్చే అభియోగాలను సిబిఐకి నివేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా వుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సిబిఐ ముప్పు పొంచి వున్నట్లే భావించాలి. సో.. చంద్రబాబుపై విచారణకు వచ్చే కేసులను బెజవాడలో ఏర్పాటయ్యే సిబిఐ కోర్టులోనే విచారించాల్సి వుంటుంది.
ఇలా ఒక్క దెబ్బతో ఇద్దరు అధినేతలను ఇరుకున పెట్టేందుకు ఏపీ బీజేపీ నాయకులు విజయవాడలో సిబిఐ కోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను వినిపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. బెజవాడలో సిబిఐ కోర్టు ఏర్పాటైతే ప్రస్తుతం వున్న కేసులతో జగన్మోహన్ రెడ్డి, తిరగదోడుతున్న అంశాలు, గత అయిదేళ్ళ అక్రమాల కేసులతో చంద్రబాబు సిబిఐ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. మరి కేంద్రం ఎలా రియాక్టవుతుందో వేచి చూడాల్సిందే.