ఏపీ ప్రజలకు హెచ్చరిక.. కాలుష్య కోరల్లో ప్రధాన నగరాలు.. అవేంటంటే.!

|

Sep 15, 2020 | 1:12 PM

ఆంధ్రప్రదేశ్‌‌లోని ప్రధాన నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు..

ఏపీ ప్రజలకు హెచ్చరిక.. కాలుష్య కోరల్లో ప్రధాన నగరాలు.. అవేంటంటే.!
Follow us on

AP 13 Cities Effected By Air Pollution: ఆంధ్రప్రదేశ్‌‌లోని ప్రధాన నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఏపీలోని 13 నగరాల్లో కాలుష్యం తీవ్రత విపరీతంగా ఉందని.. ఆయా ప్రాంతాల్లో గాలి స్వచ్ఛత అత్యల్పంగా ఉన్నట్లు ఆయన అన్నారు. 2014-2018 మధ్య దేశంలోని వివిధ నగరాలలో గాలి నాణ్యతపై జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైయ్యాయని అన్నారు. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విజయనగరంలలో స్వచ్ఛమైన గాలి నాణ్యత అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించామని కేంద్ర మంత్రి అన్నారు.

కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్రం నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాంను ప్రారంభించిందన్న ఆయన.. ఆయా ప్రాంతాల్లో కాలుష్యం పెరగడానికి గల కారణాలపై అధ్యయనం చేశామని.. వాహన కాలుష్యం, చెత్త తగులబెట్టడం, నిర్మాణ, కూల్చివేత పనుల వంటి కారణంగా వాయు కాలుష్యం పెరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఇక ఆ నగరాలను వాయు కాలుష్యం నుంచి కాపాడి గాలి స్వచ్ఛతను పెంచేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు బాబుల్‌ సుప్రియో లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ‌

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…