AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ మరో మిస్టేక్..సారా టెండుల్కర్ అతడి భార్యట !

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ చేసిన మరో మిస్టేక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ గాడ్‌ సచిన్ టెండుల్కర్ తనయ సారాను యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్ భార్య అని గూగుల్ చూపిస్తోంది.

గూగుల్ మరో మిస్టేక్..సారా టెండుల్కర్ అతడి భార్యట !
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2020 | 4:06 PM

Share

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ చేసిన మరో మిస్టేక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ గాడ్‌ సచిన్ టెండుల్కర్ తనయ సారాను యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్ భార్య అని గూగుల్ చూపిస్తోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే శుభ్​మన్, సారా మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందన్న ప్రచారం సోషల్ మీడయాలో ఎప్పట్నుంచో  జరుగుతుంది. వారి ప్రవర్తన కూడా అలాకే ఉంటుంది.  ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టుకోవడం, ఇద్దరు ఒకే తరహా పోస్టులు పోస్ట్ చేయడం వంటివి ఈ మధ్యకాలంలో బాగా జరిగాయి. ఇక సోషల్ మీడియా వేదికగా గిల్ ఫీల్డింగ్ ‌ఎఫర్ట్స్‌ను సారా ప్రశంసించింది.‌‌ దీంతో వీరి మధ్య ప్రేమ, డేటింగ్ నడుస్తుందంటూ వార్తలు జోరందుకున్నాయి. దాంతో సెర్చ్ ఇంజిన్ వీళ్లిద్దరిని భార్య, భర్తలు అని చూపిస్తోంది.

ఇటీవల ఇదే తరహాలో క్రికెటర్ రషీద్ ఖాన్ భార్య నటి అనుష్క శర్మ అని గూగుల్ తప్పుగా చూపించింది. తన అభిమాన నటి అనుష్క అని రషీద్ గతంలో చెప్పడం వల్ల అప్పట్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో వీరిద్దరూ భార్య భర్తలు అని సెర్చ్ ఇంజిన్ చూపించడం స్టార్ట్ చేసింది. అయితే గూగుల్​లో ఇటీవల మారిన అల్గారిథమ్స్ ఈ తప్పిదాలకు కారణమని సమాచారం.

Sara Tendulkar dating KKR's Shubman Gill? Fans speculate budding romance over IG post

Also Read :

ట్రాక్టర్‌ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే..