Another Dalit Person Head Shaving: ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం జరిగింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది. స్థానిక సుజాతనగర్‌లో ఉంటున్న శ్రీకాంత్ అనే యువకుడు సినీ నిర్మాత, దర్శకుడు నూతన్ నాయుడు ఇంట్లో గత మూడు నెలలుగా పని చేస్తున్నాడు. గత నెల అక్కడ పని మానేసిన శ్రీకాంత్‌ను సెల్ ఫోన్ చోరీ చేశాడని నూతన్ నాయుడు కుటుంబ సభ్యులు అతన్ని ఇంటికి పిలిచి శిరోముండనం చేయించారు. అంతేకాకుండా అక్కడ సిబ్బందికి ఆ యువకుడిపై దాడి కూడా చేశారు. దీనిపై బాధితుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)