సుశాంత్ మరణంపై మాటల యుద్ధం..

చర్చను మరింత రక్తి కట్టిస్తున్నారు సుశాంత్ ప్రియురాళ్లు. కెరీర్‌ పరమైన ఇబ్బందులతో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేంతా పిరికివాడు కాదని మాజీ ప్రేయసి అంకితా లోఖండే స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో నెపోటిజంతో పాటు అనేక సమస్యలున్నాయన్నారు...

సుశాంత్ మరణంపై మాటల యుద్ధం..

Ankita Lokhande Reveals About Rhea : సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. ఇప్పుడు ముంబై సినీ నగర్‌ కుదిపేస్తున్న సంచలన పేరు.  ఇప్పుడు అక్కడ ఒకటే చర్చ.. యువ నటుడి మరణం వెనక ఏం జరిగింది. ఎవరైనా ఉన్నారా.. ఎందుకు ఇలా జరిగింది. అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షాన్ని కురిస్తున్నారు. ఇదిగో ఇవే కారణాలు అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. ఎవరికి వారు ఇలా జరిగివుండవచ్చు… కాదు.. కాదు ఇదే జరిగిందని మరికొందరి వాదనలు వినిపిస్తున్నారు. దీంతో సుశాంత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన బలవన్మరణనానికి కారణమేమిటనే చిక్కుముడి మాత్రం ఇంకా వీడటం లేదు.

ఇలాంటి చర్చను మరింత రక్తి కట్టిస్తున్నారు సుశాంత్ ప్రియురాళ్లు. కెరీర్‌ పరమైన ఇబ్బందులతో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేంతా పిరికివాడు కాదని మాజీ ప్రేయసి అంకితా లోఖండే స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో నెపోటిజంతో పాటు అనేక సమస్యలున్నాయన్నారు. ఇండస్ట్రీలో రాణించాలంటే ఎన్నో ఎత్తుపల్లాల్ని ఎదుర్కోవాల్సివుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటన్నింటికి సిద్ధమయ్యే సుశాంత్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడని… అవకాశాలు రాకపోవడంతో ఒత్తిడికి గురై అతడు ఆత్మహత్య చేసుకున్నాడనేది అబద్ధమని అన్నారు. అతడి మరణం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సుశాంత్‌ తండ్రి రియా చక్రవర్తిపై చేస్తున్న ఆరోపణలకు ఖచ్చితంగా ఆధారాలు ఉండే ఉంటాయని తాను నమ్ముతన్నానని అన్నారు.

సరిగ్గా ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ మరో ప్రియురాలు రియా చక్రవర్తి ఓ వీడియోను విడుదలచేసింది. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకముంది. సత్యమే గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. న్యాయవాదుల సూచన మేరకు నాపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తాన్నాను అంటూ చెప్పారు.