తూచ్! వాళ్లిద్దరూ విడిపోలేదు.. ఇదిగో సాక్ష్యం

|

Aug 31, 2019 | 1:31 PM

కోలీవుడ్ హీరో విశాల్, అనీషా రెడ్డి మధ్య మనస్పర్థలు వచ్చాయని తాజాగా వార్తలు వచ్చాయి. ఒకవైపు అనీషా తన సోషల్ మీడియా ఖాతాలో ఎంగేజ్‌మెంట్ ఫోటోలను డిలీట్ చేసింది. మరోవైపు విశాల్ కూడా పిన్ చేసిన ఫోటోను తీసేశాడు. దీనితో వేరు విడిపోయారని వార్తలు వినిపించాయి. వీటిపై వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఆ వార్తలను ఖండించనులేదు. ఇక బ్రేకప్ ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సమయంలోనే విశాల్‌కు అనీషా ఒక అందమైన బర్త్‌డే మెసేజ్‌ను […]

తూచ్! వాళ్లిద్దరూ విడిపోలేదు.. ఇదిగో సాక్ష్యం
Follow us on

కోలీవుడ్ హీరో విశాల్, అనీషా రెడ్డి మధ్య మనస్పర్థలు వచ్చాయని తాజాగా వార్తలు వచ్చాయి. ఒకవైపు అనీషా తన సోషల్ మీడియా ఖాతాలో ఎంగేజ్‌మెంట్ ఫోటోలను డిలీట్ చేసింది. మరోవైపు విశాల్ కూడా పిన్ చేసిన ఫోటోను తీసేశాడు. దీనితో వేరు విడిపోయారని వార్తలు వినిపించాయి. వీటిపై వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఆ వార్తలను ఖండించనులేదు. ఇక బ్రేకప్ ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సమయంలోనే విశాల్‌కు అనీషా ఒక అందమైన బర్త్‌డే మెసేజ్‌ను పెట్టిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హ్యాపీ బర్త్‌డే స్టార్. నువ్వు వెలగడానికే జన్మించావు. నీలోని అందాన్ని నీతో ఉండడాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తాను. నీ దిశగా గొప్పదనం రాబోతోంది. నాకు నమ్మకం ఉంది. లవ్ ఆల్వేస్ అంటూ ఫోటోపై క్యాప్షన్ ఉంది. ఇప్పుడు ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ మళ్ళీ షాక్ అవుతున్నారు. అసలు వీళ్ళిద్దరూ నిజంగానే విడిపోయారా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇంకో అనుమానం కూడా చెలరేగుతోంది. ఇది నిజంగా అనీషా చేసిందా లేక వేరేవాళ్లు కావాలని చేసారా అని అనుమానులు కూడా వస్తున్నాయి. చూడాలి వీరిద్దరిలో ఎవరైనా ఒకరు నోరు విప్పితే కానీ.. ఈ అనుమానాలన్నిటికి ఫుల్‌స్టాప్ పడదు

.