రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ కాంగ్రెస్ నేతలతో పాటు నేషనల్ హెరాల్డ్ పత్రికలపై పరువు నష్టం కేసును దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ డిఫమేషన్ కేసులను వెనక్కి తీసుకోవాలని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అనిల్ అంబానీకి మోదీ సాయం చేశారని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించగా.. అనిల్ దీన్ని సీరియస్ గా తీసుకుని.. కాంగ్రెస్ నేత రాహుల్‌తో పాటు నేషనల్ హెరాల్డ్‌పై 5 వేల కోట్ల విలువైన పరువు నష్టం కేసు వేశారు. అహ్మదాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో ఆ దావాలు దాఖలు చేయగా.. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు అనిల్ తరపున న్యాయవాది రాకేష్ పారిక్ ఇవాళ మీడియాతో తెలిపారు.