దేశంలోనే అతి తక్కువ ధరకు తాగునీటిని అందిస్తున్న ఏపీ.. వెయ్యి లీటర్ల నీరు రూ.1.21 పైసలకే..
దేశంలోనే అత్యంత తక్కువగా ఇండస్ట్రీస్ కు కిలోలీటర్ అంటే వెయ్యి లీటర్ల నీటిని రూ.1.21 పైసలకే ఇస్తోంది. తమిళనాడులో కిలోలీటరుకు రూ.80, రాజస్థాన్ లోరూ.52, కేరళలో రూ.40 ప్రకారం వసూలు చేస్తున్నారు.
AP water supply for industries: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువకే పరిశ్రమలకు నీరు అందిస్తోంది. దేశంలోనే అత్యంత తక్కువగా ఇండస్ట్రీస్ కు కిలోలీటర్ అంటే వెయ్యి లీటర్ల నీటిని రూ.1.21 పైసలకే ఇస్తోంది. తమిళనాడులో కిలోలీటరుకు రూ.80, రాజస్థాన్ లోరూ.52, కేరళలో రూ.40 ప్రకారం వసూలు చేస్తున్నారు. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర కిలోలీటరుకు రూ.20, గుజరాత్ రూ.19.5కు తాగునీటిని అందిస్తున్నాయి.
రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన నీటిని కచ్చితంగా అందించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో ఆ దిశగా జల వనరుల శాఖతో కలిసి పరిశ్రమల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 169 పరిశ్రమలు ఏటా 50 టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్నాయి. ఇక నామమాత్రపు ధరకు ఇస్తున్న నీటి చార్జీలను కూడా సవరించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.